Virat Kohli, Smriti Mandhana A Magical Coincidence | Pink Ball Test || Oneindia Telugu

2021-10-01 1

Smriti Mandhana test century in pink ball test vs australia.
#ViratKohli
#SmritiMandhana
#Teamindia
#AuswIndW

భారత మహిళల క్రికెట్ చరిత్రలో తొలిసారి ఆడుతున్న డే అండ్ నైట్ టెస్టులో స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అదరగొట్టింది. దూకుడైన బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిన మంధాన.. కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. అంతేకాదు ఓ అరుదైన రికార్డును కూడా నెలకొల్పింది. డే అండ్ నైట్ టెస్టులో సెంచరీ సాధించిన మొదటి భారత మహిళా క్రికెటర్ గా మంధాన నిలించింది. 216 బంతుల్లో 127 పరుగులు చేసిన మంధాన.. చివరకు యాష్లే గార్డెనర్ బౌలింగ్ లో ఔటయింది. మంధాన ఇన్నింగ్స్‌లో 22 ఫోర్లు, ఓ సిక్సు ఉంది.